Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం : మహేశ్‌కుమార్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు ఐదున్నర గంటల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సీఎల్పీ సమావేశం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం జరిగింది. సీఎల్పీ (CLP) సమావేశం ముగిసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మీడియాతో మాట్లాడారు.
ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాం. సమావేశంలో ఎమ్మెల్యే (MLA) కూడా వారి అభిప్రాయాలు చెప్పారు. పథకాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. కులగణనపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించాం. పీసీసీ (PCC) కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకున్నాం.
పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చించారు. రాష్ట్ర ఆదాయం, అప్పులు, వ్యయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాం. ఫిబ్రవరిలో రెండు బహిరంగ సభలు నిర్వహిస్తాం. బహిరంగ సభలకు అధిష్ఠానం నేతలను ఆహ్వానించేందుకు ఢల్లీి వెళ్తున్నాం. ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవటం తప్పేమీ కాదు అని అన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు.