Ciara :హైదరాబాద్ లో సియారా జీఐసీ కేంద్రం

ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థల వినియోగదారుల సేవా కేంద్రాలకు సాంకేతిక సేవలను అందించే అమెరికా కంపెనీ సియారా(Ciara), తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ (జీఐసీ)ను హైదరాబాద్ (Hyderabad) లో ప్రారంభించింది. ఈ కేంద్రం అంతర్జాతీయంగా ఫార్చ్యూన్ (Fortune) 1000 కంపెనీ లకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అందిస్తుంది. సియారాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడు కేంద్రాల్లో హైదరాబాద్ అతి పెద్దదిగా నిలుస్తుందని సంస్థ సీఈఓ రిషి రానా(Rishi Rana) తెలిపారు. ఈ కేంద్రంలో మార్చి నాటికి 100 మందిని, డిసెంబరు కల్లా మరో 100 నిపుణులను తీసుకుంటామన్నారు. 2027 నాటికి వీరి సంఖ్య 500కు చేరుతుందని వెల్లడిరచారు. ప్రధానంగా ఏఐ ( కృతిమమేధ), జెన్ ఏఐ ఇంజినీర్లను నియమించుకుంటామని పేర్కొన్నారు.