తెలంగాణ గవర్నర్ తో చంద్రబాబు భేటీ

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నట్లు తెలిసింది. రాధాకృష్ణన్ తెలంగాణకు ఇటీవలే గవర్నర్‌గా నియమితులవడంతో చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం.