Chamala : కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు : ఎంపీ చామల

స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy)ని సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. కేటీఆర్ (KTR) కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు స్పీకర్‌ను ఆ పార్టీ అవమానించిందన్నారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్‌కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలి. దళిత స్పీకర్‌ను అవమానించి, అంబేడ్కర్ విగ్రహం (Ambedkar statue) వద్ద నిరసన చేస్తాననడం సిగ్గుచేటు. కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని స్తంభింపజేస్తున్నారు అని విమర్శించారు.