KCR: పార్టీ మారిన నేతలకు ఉపఎన్నిక తప్పదు.. వాళ్ల ఓటమి ఖాయం: కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలువురు బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) నేతలు తమ పార్టీ మారి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిపై అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మరోసారి ఈ అంశంపై స్పందించారు. ఇలా పార్టీలు మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉపఎన్నికలు రావడం ఖాయమని ఆయన చెప్పారు. మంగళవారం నాడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తదితరులను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ (KCR) ఈ వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమని ఆయన చెప్పారు. ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ (KCR) ధీమా వ్యక్తం చేశారు. శ్రీహరితోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోతారని జోస్యం చెప్పారు.