Srinivas Reddy : కోడిపందేల కేసు.. విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ

ఫాంహౌస్‌లో కోడిపందేల కేసులో పోలీసుల విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (Pochampally Srinivas Reddy) హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) పోలీసులు ఆయన్ను వివిధ అంశాలపై విచారించారు.
ఫిబ్రవరి 11న తోల్కట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఎస్‌వోటీ (SOT), మొయినాబాద్ పోలీసులు (Police) సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఓసారి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు నోటీలు ఇచ్చారు. ఫాంహౌస్ (Farmhouse) ను లీజుకు ఇచ్చానని విచారణలో ఆయన తెలిపారు. లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులకు అందజేశారు. లీజుకు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫౌంహౌస్‌పై దాడి చేసిన సమయంలో 46 కోడి కత్తులు, బెట్టింగ్ కాయిన్స్, 64 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.