Revanth Reddy: స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన : సీఎం రేవంత్ ఆదేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ (Young India Skill University ) ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. స్థల పరిశీలనకు దుబ్బాక (Dubbaka) వెళ్లాలని సీఎంవోకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హబ్సీపూర్-లచ్చపేట్ 2 వరుసల రోడ్డుకు రూ.35 కోట్లు మంజూరు చేశారు. హామ్ మోడల్‌లో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. అడిగిన వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన కొత్త ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.