KTR : ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను.. సస్పెండ్ చేయడం దారుణం

జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలు(MLCs) అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ పట్ల జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా, ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణం. స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన తప్పేంటని వివరణ అడిగే అవకాశం కూడా జగదీశ్‌రెడ్డికి ఇవ్వలేదు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కేసీఆర్ (KCR)ఆదేశించారు. ఇదే విషయాన్ని స్పీకర్, మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu) కు స్పష్టం చెప్పాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరాం. అయినా, పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో సభను 5 గంటలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడిరచి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని కేటీఆర్ అన్నారు.