బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎంపీలు

బీఆర్‌ఎస్ మాజీ ఎంపీలు గొడెం నగేశ్, సీతారాంనాయక్‌లు బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నేత పొంగుటేటి సుధాకర్ రెడ్డి వారికి కండువా కప్పి, సభ్యత్వ రశీదు అందజేశారు. వీరితో పాటు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, హుజూర్‌నగర్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, పెద్దపల్లి కాంగ్రెస్ నాయకుడు గోమాత శ్రీనివాసులు కూడా పార్టీలో చేరారు.