Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ..2 లక్షల మందికి : హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల మంది పింఛన్లను రద్దు చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పింఛను మొత్తం రూ.4వేలకు పెంచుతామని ఇంకా పెంచలేదని విమర్శించారు. చంద్రబాబు (Chandrababu) కు గురుదక్షిణగా గోదావరి (Godavari) జలాలను తరలిస్తున్నారని ఆరోపించారు. కన్నేపల్లి (Kannepalli) పంపులను ఆన్‌చేస్తే అన్ని ప్రాజెక్టులు (Projects) నిండుతాయన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేస్తే కేసులు పెట్టారన్నారు.







