Harish Rao : బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు : హరీశ్‌రావు

బీసీ (BC) రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి, పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడే బీసీలు సంతోషిస్తారని అన్నారు. ఈ అంశంపై శాసనసభ (Legislative Assembly)లో ఏకగ్రీవ తీర్మానానికి, పార్లమెంట్‌లో పోరాటానికి బీఆర్‌ఎస్ (BRS) కలిసి వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ ఓటేస్తామని చెప్పారు. బిల్లుపై రాహుల్ గాంధీ (Rahul Gandhi ) పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకురావాలని హరీశ్‌రావు కోరారు.