BRS : 19న బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం

పాతికేళ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ రజతోత్సవ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గం ఈ నెల 19న సమావేశం కావాలని, అధినేత కేసీఆర్(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 19న తెలంగాణభవన్ (Telangana Bhavan)లో మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీ (MLC), ఎమ్మెల్యే(MLA)లు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొననున్నారు.