భువనగిరి, నల్గొండ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

లోక్‌సభ ఎన్నికలకు మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్‌ఎస్ ప్రకటించింది. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మినహా అన్ని లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించింది.