మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

మరో రెండు పార్లమెంట్ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంకట్రామిరెడ్డిని బరిలో దించుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.