Shamshabad : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport )కు బాంబు బెదిరింపు వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్‌రూమ్ (Control room)కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపట్టారు. మరోవైపు దీన్ని ఫేక్ కాల్ (Fake call )గా భద్రతా సిబ్బంది తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి (Kamareddy) వాసిగా అధికారులు గుర్తించారు. నిందితుడికి మతిస్థిమితం లేదని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.