Ramachandra Rao: బీజేపీ, కేంద్రం పై నిందలు వేస్తే ఊరుకోం : రామచంద్రరావు

బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ (BJP) పై నిందలు వేస్తే ఊరుకోబోమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao) అన్నారు. ఢల్లీిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ (BC)లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, సాధ్యం కాదని తెలిసినా బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. అసాధ్యమైన పనిని కేంద్రంపైకి నెట్టివేస్తున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధం కాదని తెలిసినా, ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం మోసం చేస్తున్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నిందలు వస్తే ఊరుకోం. మీకు న్యాయ సలహాదారులు లేరా? ముస్లిం (Muslim ) లకు 10 శాతం రిజర్వేషన్ తీసివేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ముస్లింలకు ఇచ్చినవి రాజకీయ రిజర్వేషన్లు. అందుకే వ్యతిరేకిస్తున్నాం. 42 శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ (Ninth Schedule) లోకి తీసుకురాలేం. దానికి సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతించదు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు.