జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి భారీ షాక్ … గత ఎన్నిక కంటే ఈసారి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ (BJP)కి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల కంటే తక్కువ ఓట్లు సాధించడం, డిపాజిట్ (Deposit) కూడా కోల్పోవడంతో ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్న విమర్శను మూటగట్టుకుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే 8వేలకుపైగా ఓట్లు ఈసారి తక్కువగా రావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీజేపీకి 25,866 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 64,673 ఓట్లు వచ్చాయి. తాజా ఉపఎన్నికలో 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో బీజేపీకి 34వేల సభ్యత్వం ఉంది. కానీ, అందులో సగం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించలేకపోవడం మమ్మల్ని విస్మయానికి గురి చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు చెమటోడ్చినా ప్రత్యర్థులకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాం్ణ అంటూ బీజేపీ సీనియర్ నేత ఒకరు వాపోయారు.






