Ramachandra Rao : కాంగ్రెస్ పార్టీ బీసీల పేరుతో రాజకీయం : రామచందర్‌రావు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) , తెలంగాణ (Telangana ) లో కానీ బీసీ నేతను ముఖ్యమంత్రి చేశారా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao) కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) బీసీల పేరుతో రాజకీయం చేయాలని చూస్తోందని, బీసీలకు ఎక్కడ ప్రాధాన్యమిచ్చిందని నిలదీశారు. తొమ్మిది మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తే ఒక్క బీసీ నేతకు మాత్రమే అవకాశమిచ్చారని విమర్శించారు. క్యాబినెట్‌లో కేవలం ముగ్గురు బీసీ మంత్రులు (Ministers) మాత్రమే ఉన్నారన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, 42 శాతం రిజర్వేషన్లు కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వాలని, ఇతర మతాల వారిని కలపొద్దని డిమాండ్ చేశారు. బీసీల హక్కులను ఎంఐఎం (AIMIM) పార్టీ హరిస్తోందని, కాంగ్రెస్ కాలరాస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీలు పోరాడాల్సి అవసరముందన్నారు.