Raghunandan Rao:రాహుల్ రాజీనామా చేస్తే..బ్యాలెట్ ద్వారా: రఘునందన్‌రావు

దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి వ్యవస్థల మీద నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్ కాదని, ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం (రాజీవ్‌గాంధీ) ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించింది. రాయ్‌బరేలి (Raebareli) లో రాహుల్ రాజీనామా చేయాలి. రాహుల్ రాజీనామా చేస్తే బ్యాలెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తాం. సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) , తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్‌లో గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు. బీహార్‌లో ఓడిపోతారు కాబట్టి ఈవీఎంలు పనిచేయడం లేదంటున్నారు. ఈవీఎంలను తెచ్చిందే రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi). రాహుల్ గాంధీ గెలిచిన రాయ్‌బరేలిలో 2 లక్షల ఓట్లు అనుమానంగా కనిపిస్తున్నాయి. అక్కడ దొంగ ఓట్లతో గెలిచారు. రాహుల్ ఎన్నికను రద్దు చేయాలని కోరబోతున్నాం అని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే కేసీఆర్ ఎట్లా ఓడిపోతారు. కేటీఆర్‌కు ఎండ దెబ్బ కొట్టి తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు. కోర్టు తీర్పులు బీజేపీకి ఎందుకు చెంప పెట్టు అవుతాయి. ఎమ్మెల్సీల రద్దుపై తుది తీర్పు ఉంది. తుది తీర్పు వచ్చాక చెంప దెబ్బ ఎవరికీ తగులుతుందో చుద్దాం అని అన్నారు.