Etala Rajender : హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) హైకోర్టు ను ఆశ్రయించారు. పోచారం పీఎస్ (Pocharam PS )లో నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR)ను కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలానగర్ స్థిరాస్తి వ్యాపారిపై చేయిచేసుకున్నారని ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఈటల హైకోర్టు (high court)ను ఆశ్రయించారు.