Etala : ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఈటల

తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. మూడు తరాల ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని పార్టీలూ ఏకమై సంఘటితంగా పోరాటం చేశాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ (BJP) అన్ని విధాలుగా సహకరించింది. కేసీఆర్ (KCR) తొమ్మిదిన్నరేళ్లలో నిరంకుశ పాలన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా అమరుల కుటుంబాలకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేదు. బీఆర్‌ఎస్ పేరు చెప్పి కాంగ్రెస్ తప్పించుకుందన్నారు.
తెలంగాణ కంటే ఏపీ జీడీపీ (AP GDP), ఆదాయం తక్కువ. ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే తెలంగాణ వెలవెలబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢల్లీికి వెళ్లి ప్రధానిని పెద్దన్న అంటారు. గల్లీకి వచ్చి విమర్శిస్తారు. తెలంగాణ ప్రజల ఆశలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కల్లలు చేశాయి. ఇక్కడ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం తథ్యం. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు, నేను ఎందుకు కలుస్తాం? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? బీఆర్‌ఎస్ హయాంలోని ఒక్క అవినీతి, అక్రమాలపైనైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.