Payal Shankar : రాష్ట్రంలో బిల్లు పెట్టి.. ఢిల్లీ లో ధర్నా : పాయల్ శంకర్

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ (Congress) కు లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బిల్లు పెట్టి ఢిల్లీ (Delhi) లో ధర్నా చేస్తారని తాము అసెంబ్లీ (Assembly ) లోనే చెప్పామని వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ స్పష్టత ఇవ్వట్లేదు. తెలంగాణ వచ్చినప్పుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు ముస్లింలకు 10 శాతం ఇస్తే బీసీలకు వచ్చేది 32 శాతమే, అంటే గతం కంటే 2 శాతం తక్కువ. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఎక్కడ అమలు చేస్తున్నారో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పాలి. రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీ లో కాంగ్రెస్ చేస్తోన్న ధర్నా బీసీల కోసం కాదు, ఆ ధర్నాలో బీసీలు లేరు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సబ్‌ప్లాన్‌పై ఒత్తిడి తెస్తాం అని అన్నారు.