Maheshwar Reddy: ఇంఛార్జి మారరంటే.. ఇక మారేది సీఎంయే : మహేశ్వర్

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మారారంటే ఇక మారేది ముఖ్యమంత్రేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) టీమ్ నుంచి కొత్త ఇంఛార్జిని పెట్టారన్నారు. సీఎం ఛేంజ్ అనే మిషన్‌ను మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan ) కు అప్పగించారు. సీఎంను మార్చేందుకు ఆమె గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌లో ముఖ్యమంత్రి మార్పు ఖాయం. వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా పదేళ్లు తాను సీఎంగా ఉంటానని రేవంత్ (Revanth) చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే, ఢల్లీి నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఆయనకు ముఖ్యం. కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాడి తప్పింది. మంత్రుల తీరు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఒక్క మంత్రి కూడా సీఎంని ఖాతరు చేయడం లేదు అని వ్యాఖ్యానించారు.