హైదరాబాద్‌లో మరో రెండు స్టోర్లను ప్రారంభించి తన అడుగుజాడలను విస్తరించిన బిర్లా ఓపస్

భారతదేశంలోని ప్రముఖ పెయింట్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించేందుకు సిద్ధంగా ఉన్న బిర్లా ఓపస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 50+ ఫ్రాంఛైజ్ స్టోర్‌లను ప్రారంభించడం ద్వారా తన స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించింది. తన స్టోర్ల ద్వారా 145కి పైగా ఉత్పత్తులు, 1,200+ ఎస్‌కేయుల ఆధారిత పెయింట్‌లు, ఎనామెల్స్, ఉడ్ ఫినిషింగ్‌లు, వాల్‌పేపర్‌లతో 2,300 కన్నా ఎక్కువ టింటబుల్ కలర్ ఎంపికలతో విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది.
తన ప్రారంభ ఫ్రాంచైజీ స్టోర్‌ల విజయాన్ని అనుసరించి సెప్టెంబరు 5, 2024న, బిర్లా ఓపస్ హైదరాబాద్‌లో రెండు కొత్త స్టోర్‌లను ప్రారంభించడం ద్వారా తన ఉనికిని విస్తరించింది. ఈ దుకాణాలు అన్ని బిర్లా ఓపస్ ఉత్పత్తులను అందించే సమగ్ర కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ ప్రాంతానికి ఉన్న గొప్ప వారసత్వం, సాంస్కృతిక చైతన్యాన్ని వేడుకగా జరుపుకునే విస్తృత శ్రేణి షేడ్స్‌ను అందిస్తాయి. వినియోగదారుని సంతృప్తిపై దృష్టి కేంద్రీకరించి, దుకాణాలు డైనమిక్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తాయి. వినియోగదారులు తమకు ఆదర్శమైన రంగులు, ఉత్పత్తులను కనుగొనేందుకు సహాయపడేందుకు టెక్చర్ డిస్‌ప్లేలు, షేడ్ డెక్‌లు మరియు నిపుణుల సంప్రదింపులు అందుబాటులో ఉంటాయి.
బిర్లా ఓపస్ తమ కొత్త స్టోర్‌లను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ఇక్కడ ప్రతి బ్రష్‌స్ట్రోక్ ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది. రంగు ఎంపిక, ప్రీమియం-నాణ్యత ఉత్పత్తులు మరియు మీ దృష్టికి జీవం పోసే అత్యాధునిక పరిష్కారాలపై నిపుణుల మార్గదర్శకత్వాన్ని పొందవచ్చు.
స్టోర్ బిర్లా ఓపస్ అల్ సఫా గ్రూప్‌కు చెందిన మహ్మద్ తబ్రుద్దీన్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో మా కొత్త స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా బిర్లా ఓపస్ కుటుంబంలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. నగరానికి సంబంధించి శక్తివంతమైన శక్తి, వృద్ధి చెందుతున్న డిజైన్ సంస్కృతి మా పెయింట్‌లు, డెకర్ సొల్యూషన్‌లకు ఇది అనువైన ప్రదేశం. అద్భుతమైన రవాణా కనెక్టివిటీతో హఫీజ్ బాబా నగర్‌లోని ఇస్మత్ నగర్‌లోని అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతంలో ఉన్న మా స్టోర్ స్థానిక నివాసులకు మా విస్తృతమైన ఉత్పత్తి శ్రేణిని అన్వేషించేందుకు చక్కని, ఆహ్వానించదగిన స్థలాన్ని అందిస్తుంది’’ అని వివరించారు.
స్టోర్ బిర్లా ఓపస్ అపెక్స్ బిల్డింగ్ సొల్యూషన్స్‌కు చెందిన నకుల్ వ్యాస్ మాట్లాడుతూ, “బిర్లా ఓపస్ పెయింట్ గ్యాలరీతో కలిసి పనిచేయడం నాకు ఒక కల లాంటిది. ఈ సహకారం నా కలను నిజం చేసింది. నేను బ్రాండ్‌ను ప్రేమిస్తున్నాను. వారి అత్యాధునిక ఉత్పత్తులు, ప్రత్యేకించి పెయింట్ వ్యర్థాలను తగ్గించేందుకు యాంటీ-స్పాటర్ టెక్నిక్‌ని కలుపుకుని, ఏఐ వినియోగంతో పాటు అద్భుతమైన కవరేజీని నిర్ధారిస్తుంది.ఈ భాగస్వామ్యం అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మాకు ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
దుకాణాలు ఇప్పుడు వ్యాపారులు మరియు వినియోగదారులకు సోమవారం నుంచి శనివారం వరకు తెరిచి ఉంటాయి. ఆదివారాలు మినహా వారపు రోజులలో వారి ఆఫర్‌లను అన్వేషించుకునేందుకు ప్రతి ఒక్కరికీ కంపెనీ ఆహ్వానం పలుకుతోంది.
స్టోర్ వివరాలు:
1. స్టోర్ 1 – అల్ సఫా గ్రూప్, 18 12 419/C/6, ఇస్మత్ నగర్, హఫీజ్ బాబా నగర్, హైదరాబాద్ 500023
2. స్టోర్ 2 – అపెక్స్ బిల్డింగ్ సొల్యూషన్స్, హౌస్ నం.4-3/38, ప్లాట్ నెం 38, పొప్పల్‌గూడ గ్రామం, మణికొండ, హైదరాబాద్, తెలంగాణ -500089