Bhatti Vikramarka :తెలంగాణలో విప్లవాత్మక మార్పు : భట్టి విక్రమార్క

తెలంగాణలో చేపడుతున్న సంస్కరణలు, నిర్ణయాలు, దేశానికి దశాదిశ నిర్దేశించే స్థాయిలో ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ట్యాంక్‌బండ్ సమీపంలోని పాపన్నగౌడ్ (Papanna Goud) విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టామన్నారు. బీసీ (BC)లకు 42 శాతం రిజర్వేషన్లపై చట్టం చేశామని తెలిపారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు దేశంలోనూ అమలుకు దారి తీశాయని వివరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రతి గ్రామం, ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం తెలంగాణ (Telangana)లో విప్లవాత్మక మార్పు తీసుకువస్తోందని వివరించారు. కాంగ్రెస్ (Congress) మూల సిద్ధాంతం సామాజిక న్యాయమని తెలిపారు.