Bhatti Vikramarka : తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు

రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రభుత్వం బూట్ (బిల్డ్ ఆన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల (Electrical projects )పై ప్రతిపాదనలు ఆహ్వానించగా, తెలంగాణ విద్యుత్‌శాఖ అధికారుల బృందం ఆయా ప్రతిపాదనలపై అధ్యయ నం చేసి, 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది. హిమచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్ (Sukhwinder Singh) సఖుతో ఢిల్లీ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 400 మెగావాట్ల సెలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించారు. వాటికి సంబంధించిన ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసి త్వరితగతిన ఎంవోయూ (MOU)పై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని భట్టి తెలిపారు.