కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న “భారతి” శిష్యులు

అన్నమాచార్యుల వారి సంకీర్తనలను, తత్త్వాన్ని ప్రచారం చేసే నిరంతర యజ్ఞంలో భాగంగా పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో ఆగష్టు 24వ తేదీన "అన్నమ స్వరర్చాన" లో భారతి కూచిపూడి డాన్స్ అకాడెమి విద్యార్థులు జి. సాయిహర్షిత, సి. హెచ్ .గోహిత శ్రీదేవి, ఎ.పి. శోడశి, ఎ.నిర్విఘ్న, ఆర్.బహుళిక, బి.వెంకట శ్రావ్య, ఎ. సంయుక్త, నిఖిత, డి. జైష్ణవి, బి.భువన, లేఖ్యశ్రీ బృందం "మహా గణపతిం", " దశావతారం శబ్దం", " మరకతమణి", "మూషిక వాహన", " సతులార చూడరే శ్రావణ బహులాష్టమి", " చక్కని తల్లికి" , " రామాయణ శబ్దం", " నారాయణీయం", "పరమ పురుషుడు" "కొలువైతివా రంగశాయి" వంటి చక్కని నృత్య గతులు ప్రదర్శన చేసి ప్రేక్షకులను అలరించారు. పద్మశ్రీ డా. శోభారాజు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమానంతరం కళాకారులను సత్కరించారు. అనంతరం మంగళ హారతి అందించి, అందరికీ తీర్థ, ప్రసాదాలను అందజేయండంతో కార్యక్రమం ముగిసింది