17న శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కల్యాణం( శ్రీరామనవమి), 18న స్వామివారికి మహాపట్టాభిషేకం ఉంటాయని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 9 నుంచి 13వ తేదీ వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. 14న గరుడధ్వజపటలే ఖనం, 15 అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం, బలిసమర్పణ, హనుమంత వాహనసేవ, 16న గరుడ వాహన సేవల ఉంటాయని తెలిపారు.