Bandi Sanjay : 12 లక్షల మినహాయింపు.. విప్లవాత్మక నిర్ణయం : బండి సంజయ్

దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బడ్జెట్ 2025-26 పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్‌గా ఆయన పేర్కొన్నారు. 2027 నాటికి అమెరికా, చైనా తర్వాత మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ (India) అవతరించే దిశగా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు. వేతన జీవులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక నిర్ణయం అని కొనియాడారు. కిసాన్ క్రెడిట్ కార్డు (Kisan Credit Card)ల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో 50 లక్షల మందిపైగా రైతులు రూ. 5లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కు బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని, కేంద్రానికి సహకరించాలని సూచించారు.