Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) దీటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. “ఆట మొదలైంది. ఇక చూసుకుందాం. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు” అని ఆయన పేర్కొన్నారు. అసలైన నిజం త్వరలోనే బయటపడుతుందని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. “నిజం ఒక సింహం.. దాన్ని కాపాడితే, అది మనల్ని రక్షించుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా జీవితాలను నాశనం చేసిన నేరస్థులు త్వరలోనే బయటపడతారు” అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ (Bandi Sanjay) అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని, తన రాజకీయ ఉనికి కోసమే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో హెచ్చరించారు.