Bandi Sanjay: గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా.. సీఎం ఏం చేస్తారో చూడాలి : బండి సంజయ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రాసిక్యూషన్కు తెలంగాణ గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. ఫార్మూల ఈ కార్ కేసు కేసులో ఏసీబీ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ (BJP) ఒకేటే అని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పుడేం సమాధానం చెబుతారు? ఇన్నాళ్లూ గవర్నర్ అనుమతి ఇవ్వొద్దనే సీఎం కోరుకున్నారు. అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానని గతంలో ఆయన అన్నారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా, సీఎం ఏం చేస్తారో చూడాలి అని అన్నారు.






