Bandi Sanjay : వారి అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ : బండి సంజయ్

స్త్రీలను గౌరవిస్తూ, వారి అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి(President), ఆర్థిక మంత్రి (Finance Minister )గా మహిళలకు తమ పార్టీ అవకాశం కల్పించిందని చెప్పారు. మహిళా శక్తి అంటే పెద్దపెద్ద ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితమవడమా అని కాంగ్రెస్ (Congress) ను ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 హామీ ఏమైంది? తులం బంగారం, స్కూటీ (Scooty) హామలు ఎటు పోయాయి? బెల్టు షాపుల నిర్మూలన వాగ్దానం ఏమైంది? తెలంగాణ మహిళలు రాణి రుద్రమదేవి వారసులు. మభ్యపెట్టే పాలకులకు కర్చుకాల్సి వాత పెట్టడం తథ్యం అని పేర్కొన్నారు.