Dattatreya: కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తనవంతు కృషి :బండారు దత్తాత్రేయ
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్లోని నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya), మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ (Mahmood Ali) పరామర్శించారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ చిన్న బావమరిది మహ్మద్ షాహీద్ను పలుకరించి ఓదార్చారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో 18 మంది చనిపోవడం బాధాకరమన్నారు.నసీరుద్దీన్ (Naseeruddin) కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సౌదీ (Saudi)లోని మదీనా మసీదులో వారి పేర్లపై అధికారికంగా ప్రార్థనలు జరిపి వారి ఆత్మకు శాంతి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానన్నారు. మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ మాట్లాడుతూ మృతదేహాలను గుర్తించేందుకు వారి బంధువులను వెంటనే సౌదీకి తీసుకెళ్లేలా,రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ పరంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా పాటుపడతానన్నారు.






