Balapur Laddu: గత రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. ఈ సారి ఎంత ధర పలికిందంటే..

తెలుగు రాష్ట్రాలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బాలాపూర్ లడ్డూ(Balapur Laddu) వేలంలో పాట ఎంతో ఘనంగా సాగింది. ఈ సారి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. దీన్ని రూ.35 లక్షలకు లింగాల దశరథ గౌడ్(Lingala Dasharatha Goud) దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూను 30.1 లక్షలకు కొలను శంకర్ రెడ్డి (Kolanu Shankar Reddy) దక్కించుకున్నారు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 38 మంది పాల్గొన్నారు. వారిలో ఏడుగురు స్థానికేతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) , తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.