Ashwini Vaishnav: 2026లో కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభం : మంత్రి అశ్వినీ వైష్ణవ్

కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)తో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ కాజీపేట (Kazipet) లో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Railway Coach Factory)ని కేంద్రం నిర్మిస్తోందని, పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయారవుతాయని తెలిపారు.