పోచారంలోని ASBL స్ప్రింగ్స్ వద్ద దాదాపు 800 మందితో రన్ ఫర్ యూనిటీ రన్ ను నిర్వహించిన ASBL

సమాజ స్ఫూర్తిని ప్రదర్శించడానికి , తమ నివాసితులు మరియు పొరుగు సమాజాలలో ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి, రన్ ఫర్ యూనిటీ ( #RunForUnity) పేరిట మారథాన్‌ను రిపబ్లిక్ దినోత్సవం నాడు పోచారంలోని ASBL స్ప్రింగ్స్ వద్ద నిర్వహించింది. దాదాపు 800 మందికి పైగా ఈ రన్ లో పాల్గొన్నారు. ASBL స్ప్రింగ్స్ నివాసితులు మరియు స్థానిక సమాజాలను ఒకచోట చేర్చుతూ, చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం పట్ల ASBL యొక్క నిబద్ధతను ఈ కార్యక్రమం నొక్కి చెప్పింది. రిపబ్లిక్ దినోత్సవం నాడు ఈ మారథాన్ ను నిర్వహించడం సమాజంలో ఐక్యత మరియు శ్రేయస్సును పెంపొందించడం పట్ల బ్రాండ్ యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.
పిల్లల నుండి సీనియర్ సిటిజన్ల వరకు 5K మరియు 10K పరుగులో పాల్గొన్నారు. 250 మందికి పైగా అభ్యర్థులు 10K సవాలును జయించటానికి అద్భుతమైన సంకల్పం మరియు స్ఫూర్తిని ప్రదర్శించారు. ప్రతి వయస్సు మరియు లింగ వర్గం నుండి విజేతలు మెమెంటో షీల్డ్‌లు మరియు నగదు బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమ విజయం కమ్యూనిటీ యొక్క సత్తా ను చూపించింది మరియు వారి కమ్యూనిటీలలో ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడంలో ASBL యొక్క నిబద్ధతకు ఉదాహరణగా నిలిచింది. ఈ మారథాన్ ASBL స్ప్రింగ్స్ వద్ద ప్రారంభమై అక్కడే ముగిసింది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో 18 కి పైగా ఫిట్‌నెస్ మరియు క్రీడా సౌకర్యాలు ఉన్నాయి, వీటిలో నడక, సైక్లింగ్ మరియు జాగింగ్ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయి. ఈ ప్రాపర్టీ ఇప్పుడు నివసించేందుకు పూర్తి సిద్ధంగా ఉంది, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సు కోసం అనువైన అవకాశాలను అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో టోన్ టేల్స్ ఉత్సాహపూరితమైన ప్రదర్శనలను చేసింది, కార్యక్రమానికి మరింత ఉత్సాహం అందిస్తూ ప్రసిద్ధ సంగీతాన్ని ప్లే చేసింది. ఇది మారథాన్ అంతటా ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొనటానికి మరియు వారు లీనం కావటానికి సహాయపడింది.
ASBL యొక్క సీఈఓ మరియు వ్యవస్థాపకుడు శ్రీ అజితేష్ కొరుపోలు తన ఆలోచనలను పంచుకుంటూ , “అనుసంధానిత మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలనే మా ముఖ్య విలువలను #RunForUnity మారథాన్ ప్రతిబింబిస్తుంది. ఈ రోజు ఇక్కడ పాల్గొన్నవారు ప్రదర్శించిన ఉత్సాహం, ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్ యొక్క సవాలును కమ్యూనిటీ-ఆధారిత కార్యక్రమాల ద్వారా ఉత్తమంగా ఎదుర్కోగలరని రుజువు చేస్తుంది. మా నివాసితులు ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి ప్రేరేపించే స్ప్రింగ్స్ వంటి స్థలాలను అందించడం పట్ల మేము గర్విస్తున్నాము” అని అన్నారు
ASBL సహ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్-బిజినెస్ డెవలప్‌మెంట్ శ్రీ అనిల్ కుమార్ తోట మాట్లాడుతూ, “ASBL యొక్క ఐక్యత, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సు అనే లక్ష్యాలకు అనుగుణంగా ఉండే ఈ కార్యక్రమంలో భాగం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈరోజు పాల్గొన్న వారందరూ పంచుకున్న శక్తి మరియు ఆనందం నాకు స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం కొనసాగించగలమని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు.