హైదరాబాద్ నుండి ఏపీకి 13 వేల మంది తరలింపు
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకునిపోయి ఆంధప్రదేశ్‌కు రావాలనుకునేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే హైదరాబాద్ నుండి స్వంత ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నామని సీఎం స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఆ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ నుండి 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా నుంచి ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు 13 వేల మందిని ఆంధప్రదేశ్‌లోని వారి స్వస్థలాలకు చేర్చనున్నారు. అయితే ఆంధప్రదేశ్‌కు వచ్చిన వారి తర్వాత వారివారి జిల్లాల్లో క్వారంటైన్లో ఉంటామని అంగీకరించిన వారిని మాత్రమే తరలిస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీలను, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ బస్సులు మియాపూర్-బొల్లారం క్రాస్‌రోడ్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, ఎల్బీ నగర్లలో ప్రయాణికులను ఎక్కించుకొని ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి.






