Apollo Hospitals: భారతదేశంలో విప్లవాత్మకమైన అపోలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్

కదలికలు కాపాడటానికి మరియు నమ్మకాన్ని పెంపొందించటానికి ముందస్తు జోక్యం, వ్యక్తిగతీకరించిన చికిత్సతో కీళ్ల సంరక్షణకు కొత్త విధానంలా తోడ్పడనుంది.
తమ హాస్పిటల్ నెట్‌వర్క్ అంతటా కీళ్ల సంరక్షణను (జాయింట్ కేర్‌ను) విప్లవాత్మకంగా మార్చడంలో భాగంగా భారతదేశంలో తమ వినూత్నమైన అపోలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్‌ను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. ఈ మార్గదర్శక కార్యక్రమం, వ్యక్తులు తమ కదలికలు నిర్వహించటంతో పాటుగా విశ్వాసాన్ని పెంపొందించుకోవటంలో సహాయపడటానికి ముందుగానే సమస్యను గుర్తించి వ్యక్తిగతీకరించిన చికిత్స అందించటం పై దృష్టి పెడుతుంది, అదే సమయంలో కీళ్ల ఆరోగ్యానికి చురుకైన విధానాన్ని పెంపొందిస్తుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి, సిడ్నీలోని రాయల్ ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ & మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ బ్రెట్ ఫ్రిట్ష్, హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్- అపోలో హాస్పిటల్స్ సీఈఓ శ్రీ తేజస్వి రావు, అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి , అపోలో హాస్పిటల్స్‌లోని ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవి తేజ రుద్రరాజు, అపోలో హాస్పిటల్స్‌లోని సీనియర్ కన్సల్టెంట్-ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ కౌశిక్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్‌లోని షోల్డర్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ మేష్రామ్ మరియు అపోలో హాస్పిటల్స్‌లోని ఫుట్ & యాంకిల్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ వరుణ్ కొమ్మాలపాటి పాల్గొన్నారు.
సమగ్రమైన, నమ్మకమైన కీళ్ల సంరక్షణను అందించడానికి రూపొందించబడిన అపోలో జాయింట్ ప్రిజర్వేషన్ కార్యక్రమం కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు మరియు స్నాయువు గాయాలతో బాధపడుతున్న రోగుల అవసరాల తీర్చటం కోసం రూపొందించబడింది. చురుకైన , ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పడం ద్వారా, ఈ కార్యక్రమం అసౌకర్యాన్ని తగ్గించడానికి , సాధ్యమైనంత ఎక్కువ కాలం పలురకముల శస్త్ర సంబంధిత విధానాల అవసరాన్ని నివారించడానికి ప్రయత్నిస్తుంది.
జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవం సందర్భంగా వైద్య బృందాన్ని అభినందించిన , అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ, “అపోలోలోని జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ రోగికి సౌకర్యం , మద్దతు అందించటమనే నేపథ్యంతో రూపొందించబడినది. ఇది కీళ్ల నొప్పులు లేదా క్షీణతకు అందుబాటులో ఉన్న చికిత్సా అవకాశాల గురించి తెలియని అన్ని వయసుల వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా, మా నిపుణుల బృందం : టైలర్డ్ అడ్వైజ్ ( అనుకూలీకరించిన సలహా) , ట్రీట్మెంట్ (చికిత్స (వైద్య మరియు శస్త్రచికిత్స రెండూ)) , మరియు థెరఫీస్ (చికిత్స ప్రక్రియలు (రీహాబిలిటేషన్ , పోషకాహారం మరియు ప్రత్యామ్నాయ చికిత్సలతో సహా) – ‘3 Ts’ పై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం , ప్రజలు తమ కదలికలు కాపాడుకోవడానికి మరియు సుదీర్ఘకాలం పాటు వారు తమ జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడటానికి తోడ్పడనుంది. కీళ్ల పనితీరు మెరుగుపరచటానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, చురుకైన జీవనశైలిని నిర్వహించడానికి, తాము ఇష్టపడేదాన్ని చేయడం కొనసాగించడానికి వ్యక్తులను శక్తివంతం చేయాలనుకుంటున్నాము” అని అన్నారు.
ఈ కార్యక్రమం రోగులకు ముందస్తు రోగ నిర్ధారణ , అనుకూలీకరించిన చికిత్సల నుండి ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుంది, ఇది ప్రధానంగా కీళ్ల ఆరోగ్య సమస్యలను ఆలస్యం చేయగలదు లేదా నివారించగలదు. తమ కీళ్లకు వేరే చోట చికిత్స పొందాలని సూచించబడిన రోగులు, అలాగే కీళ్ల నొప్పులకు మొదటిసారిగా డాక్టర్ ను సంప్రదించాలని కోరుకునే వారు ఇప్పుడు విస్తృత శ్రేణిలో సమగ్ర చికిత్సా ఎంపికలను పొందగలుగుతారు.
“అపోలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్, కీళ్ల సంరక్షణను పునర్నిర్వచించడానికి అధునాతన ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులను చికిత్సలతో అనుసంధానిస్తుంది. కీళ్ల పనితీరును కాపాడటం , పూర్తి మార్పిడి అవసరాన్ని ఆలస్యం చేయడం లేదా పూర్తిగా నివారించడంపై మేము దృష్టి సారించాము” అని అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి అన్నారు.
అపోలో హాస్పిటల్స్‌లోని ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు మాట్లాడుతూ “ఈ కార్యక్రమం అత్యాధునిక రీ జెనరేటివ్ చికిత్సలను సమగ్రమైన రీహాబిలిటేషన్, పోషకాహార పద్దతులతో మిళితం చేసి సమగ్ర చికిత్స మార్గాన్ని అందిస్తుంది. ఇది ప్రతి రోగికి వ్యక్తిగతీకరించిన రీతిలో , స్పష్టమైన , సౌకర్యవంతమైన పద్దతిలో కోలుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం కీళ్ల సమస్యలకు ముందుగానే ప్రభావవంతమైన చికిత్సను అందించటం సులభతరం చేస్తుంది, చివరికి మెరుగైన క్లినికల్ ఫలితాలకు దారితీస్తుంది”అని అన్నారు.
క్రీడా సంబంధిత , అభివృద్ధి చెందుతున్న కీళ్ల సమస్యలకు ఈ కార్యక్రమం ఎలా ఒక ప్రత్యేకమైన పరిష్కారంగా నిలుస్తుందో అపోలో హాస్పిటల్స్‌లోని ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కౌశిక్ రెడ్డి వెల్లడిస్తూ క్రీడాకారులకు డౌన్‌టైమ్‌ను తగ్గించడం , సహజ వైద్యంను ప్రోత్సహించడం గురించి మాట్లాడారు.
అపోలో హాస్పిటల్స్‌లో షోల్డర్ సర్జన్ – కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ మేష్‌రామ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కీళ్ల సంరక్షణలో, ముఖ్యంగా భుజం సంబంధిత చికిత్సలతో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి, రోగులకు తక్షణ శస్త్రచికిత్స చేయించుకోనవసరం లేకుండా ప్రత్యామ్నాలను పొందడానికి సహాయపడుతుందని అన్నారు.
అపోలో హాస్పిటల్స్‌లోని ఫుట్ & యాంకిల్ సర్జన్ – కన్సల్టెంట్ డాక్టర్ వరుణ్ కొమ్మాలపాటి మాట్లాడుతూ, అనుకూలీకరించిన , అతి తక్కువ కోత కలిగిన చికిత్స విధానాలు కీళ్ల సమస్యల మూల కారణాలను లక్ష్యంగా చేసుకోగలవని, శాశ్వత కదలికలు, మెరుగైన జీవన నాణ్యతను సాధించగలవని అన్నారు.
ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) చికిత్స, అత్యాధునిక స్టెమ్ సెల్ వినియోగం వంటి మార్గదర్శక పునరుత్పత్తి చికిత్సలతో పాటు అధునాతన ఆర్థోబయోలాజిక్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా, రోగులు తమ కీళ్ల పనితీరును మెరుగ్గా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తాము. ఈ అనుకూలీకరించిన విధానం, ప్రధాన శస్త్రచికిత్స జోక్యాలను అధిగమించడంలో సహాయపడటమే కాకుండా శక్తివంతమైన , చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది, తద్వారా దీర్ఘకాలిక కీళ్ల ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సును నిర్ధారిస్తుంది.
వాపును తగ్గించడానికి , కీళ్ల మరమ్మత్తును వేగవంతం చేయడానికి శరీరం యొక్క స్వాభావిక వైద్య సామర్థ్యం పై PRP ఇంజెక్షన్లు ఆధారపడతాయి. స్టెమ్ సెల్ చికిత్సలతో సహా పునరుత్పత్తి చికిత్సలు మృదులాస్థిని పునరుజ్జీవింపజేయడం , మొత్తం కీళ్ల పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంటాయి, అయితే ఆస్టియోటోమీ వంటి శస్త్రచికిత్సా పద్ధతులు అమరిక వ్యత్యాసాలను సరిచేస్తాయి, ఉపశమనం కలిగించటంతో పాటుగా మెరుగైన కదలికలను అందిస్తాయి. అదనపు శస్త్రచికిత్సా పద్ధతుల్లో కాండ్రల్ లోపాలు, మెనిస్కల్ మరమ్మతులు, లిగమెంట్ పునర్నిర్మాణాలు మరియు యూనికోండిలార్ మోకాలి మార్పిడి వంటి విధానాలకు ఆర్థ్రోస్కోపిక్ మరియు ఓపెన్ విధానాలు ఉంటాయి, ఇవి సహజ కీళ్ల నిర్మాణం మరియు పనితీరును మరింతగా సంరక్షించడానికి తోడ్పడతాయి.
అంతేకాకుండా , రోగులు ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ , బరువు నిర్వహణ కోసం పోషకాహార కౌన్సెలింగ్ , ఇతర అనుబంధ చికిత్సలతో సహా విస్తృత శ్రేణి మద్దతు సేవలను పొందుతారు. ఈ సమగ్ర వ్యూహం సహజమైన రీతిలో కీళ్ల పనితీరును కాపాడటానికి మాత్రమే కాకుండా, రోగి విశ్వాసాన్ని , వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో నిరంతర అనుసంధానితను పెంపొందించడానికి కూడా రూపొందించబడింది, తద్వారా ఖచ్చితంగా అవసరమైనప్పుడు కీళ్ల మార్పిడిని సులభతరంగా చేసేందుకు తోడ్పడుతుంది.
ఈ జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్సా అవకాశాలు , మద్దతు సేవలతో, మరింత చురుకైన మరియు సంతృప్తికరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ అందరికీ జీవన నాణ్యతను పెంచడానికి అపోలో హాస్పిటల్స్ కట్టుబడి ఉంది.