Banakacharla Project : పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పనులు ఇంకా చేపట్టలేదు : కేంద్రం

పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) పనులు ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని కేంద్రం పార్లమెంటుకు వెల్లడిరచింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav ) ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. సాంకేతిక, ఆర్థిక అంచనాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (Pre-feasibility report) ను కేంద్ర జలసంఘానికి అందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖ రాసిందని చెప్పింది. ప్రాజెక్టుపై సంబంధిత అధికారులు, పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి (Rajbhushan Chowdhury) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.