Telangana :తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… అన్ని పార్టీల ఎంపీలతో

కేంద్రం వద్ద పెండిరగ్‌లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రధాని మోదీ (Modi), మంత్రులను కలిసి మెట్రో విస్తరణ(Metro expansion) , ముసీ పునరుజ్జీవనం, ఆర్‌ఆర్‌ఆర్ (RRR) తదితర అంశాలపై విన్నవించారు. పెండిరగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాభవన్ (Praja Bhavan) లో ఈనెల 8న అన్ని పార్టీల ఎంపీల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka )అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండిరగ్‌లో ఉన్న అంశాలపై సమావవేశంలో చర్చించనున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో రాష్ట్రంలోని అందరు ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి భేటీకి ఆహ్వానించారు.