నిన్న విమానాలు … నేడు సీఆర్‌పీఎఫ్ పాఠశాలలు

సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల వద్ద బాంబ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. పాఠశాలకు చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలోని పిల్లలను క్షేమంగా వారి ఇళ్లకు స్కూల్ యాజమాన్యం పంపించింది. ఘటనా స్థలికి రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీబీ మహేశ్ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.