శరవేగంగా ముస్తాబవుతున్న ఆకృతి టౌన్ షిప్

ఉప్పల్-యాదాద్రి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మెట్రో రైలు, యాదాద్రి అభివృద్ధి పనులు పోచారంలోని ఐటీ కంపెనీలు వంటి పలు కారణాల వల్ల ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. దానికితోడు బ్రాండెడ్ షోరూమ్‌లు, అంతర్జాతీయ పాఠశాలలు, ఆసుపత్రులు, మల్లీప్లెక్స్‌లు పుడ్ కోర్టులూ కూడా ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఇలాంటి ప్రాంతంలో అందుబాటు ధరల్లో ఇళ్లను అందించాలనే లక్ష్యంతో బోడుప్పల్ లో ఆకృతి టౌన్‌షిప్‌ను ప్రారంభించినట్లు సురక్ష ఎవెన్యూ ప్రై.లి.పేర్కొంది. 5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ 8 బ్లాకుల్లో సెల్లార్ +స్టిల్ట్ +8 అంతస్తుల్లో ఉంటుంది.
ఇందులో మొత్తం 472 ప్లాట్లుంటాయి. 2 బీహెచ్‌కే 256 యూనిట్లు, 3 బీహెచ్‌కే 216 యూనిట్లుంటాయి. 1,000 నుంచి 2,300 చ.అ. మధ్య ప్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర చ.అ.కు. రూ.3,000, ఇప్పటికే 272 ప్లాట్ల నిర్మాణం పూర్తయి కొనుగోలుదారులకు అప్పగించినట్లు కంపెనీ తెలిపింది.
ఆకృతి టౌన్‌షిప్‌లో 40 వేల చ.అ.ల్లో ఆధునిక వసతులన్నీ ఉంటాయి. వసతుల కోసం 8 అంతస్తుల్లో ప్రత్యేకంగా బ్లాక్‌ను కూడా కేటాయించారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, మినీ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, లేడీస్ క్లబ్, గెస్ట్ రూమ్స్, సూపర్ మార్కెట్, స్పా కెపెటేరియా, డిస్సెన్సరీ వంటివన్నీ ఉంటాయి. వచ్చే ఏడాది ముగింపు నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. నాగోల్ లో 1.25 లక్షల చ.అ.ల్లో , హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 2లో 30 వేల చ.అ.ల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కూడా కంపెనీ చేపట్టింది. నాగోల్ ప్రాజెక్ట్‌లో 4 స్క్రీన్స్ మల్లీఫ్లెక్స్, మూడంతస్తుల్లో పుడ్ కోర్ట్స్, ఇతర బ్రాండెడ్ షోరూమ్స్ రానున్నాయి. హబ్సిగూడ ప్రాజెక్ట్‌లో మూడంతస్తుల్లో రిలయన్స్ ట్రెండ్స్ రానుంది.