Ambedkar University: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పోలీసుశాఖ మధ్య ఒప్పందం

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University), తెలంగాణ పోలీసుశాఖ (Telangana Police Department) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దూరవిద్య విధానంలో కానిస్టేబుళ్లు (Constables) డిగ్రీ చదివేందుకు వీలుగా యూనివర్సిటీ, పోలీసు అధికారులు ఎంఓయూ చేసుకున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలను డీజీపీ జితేందర్ (DGP Jitender) , వర్సిటీ ఉన్నతాధికారులు మార్చుకున్నారు. డిగ్రీ (Degree) పూర్తికాని కానిస్టేబుళ్లు, ఏఎస్సైలకు దూరవిద్య విధానం అమలు చేయనున్నారు. కానిస్టేబుళ్లకు కోర్సు మెటీరియల్, స్టడీ సెంటర్ యాక్సెస్ ఇస్తామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.