Adi Srinivas: అధికారం లేకపోతే.. ఈ వేడుకల్లో పాల్గొనరా? : ఆది శ్రీనివాస్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద పండగలా నిర్వహించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 2న బీఆర్‌ఎస్ (BRS) మాత్రమే ఈ వేడుకలను నిర్వహించలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుంటుందా? అని ప్రశ్నించారు. జూన్ 2న కేసీఆర్ (KCR) బయటికి రాలేదు. కనీసం అమరవీరులకు నివాళులర్పించలేదు. కేటీఆర్ అమెరికా (America) కు వెళ్లారు. ఆయనా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనలేదు. అధికారం లేకపోతే ఈ వేడుకల్లో పాల్గొనరా? అధికారం ఇవ్వకుంటే ప్రజల్లోకి వచ్చేది లేదని బీఆర్‌ఎస్ నేతలు ఒక సంకేతం ఇచ్చారు. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రుణ మాఫీ చేసింది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీని సక్రమంగా ఎప్పుడూ పూర్తి చేయలేదు అని విమర్శించారు.