ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన BEBIG Medical కంపెనీ ప్రతినిధుల బృందం భేటీ

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జర్మనీకి చెందిన BEBIG Medical కంపెనీ చైర్మన్ & సీఈవో జార్జ్ చాన్ ( George Chan) ప్రతినిధి బృందం.
తెలంగాణలో మెడికల్ ఎక్విప్ మెంట్ ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్న జర్మన్ కంపెనీ.
తెలంగాణలో మెడికల్ ఎక్విప్ మెంట్ ఉత్పత్తి యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన సీఎం.
అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని అధికారులకు సూచించిన సీఎం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్ మెంట్ తో పాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరిన సీఎం.