7సీస్ గేమ్‌కు ఫిక్కీ అవార్డ్ – మారుతి శంకర్

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మక యానిమేటెడ్ ఫ్రేమ్స్ (బీఏఎఫ్) అవార్డును దక్కించుకుంది. అత్యుత్తమ భారతీయ గేమ్స్ విభాగం (మేడిన్ ఇండియా)లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ).. 7సీస్‌కు చెందిన రోలర్ కోస్టర్ సిమ్యులేటర్ గేమ్‌కు ఈ అవార్డును అందజేసింది. బెస్ట్ ఇండియన్ గేమ్ విభాగంలో కంపెనీకి అవార్డు లభించటం ఎంతో సంతోషంగా ఉందని, ఇప్పటికే రోలర్ కోస్టర్ గేమ్ 20 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్‌కు చేరుకుందని 7సీస్ ఎండీ ఎల్ మారుతి శంకర్ తెలిపారు.
బెస్ట్ ఇండియన్ గేమ్ కేటగిరీలో ఈ అవార్డ్ దక్కడం చాలా ఆనందంగా ఉందని కంపెనీ ఎండీ ఎల్ మారుతి శంకర్ పేర్కొన్నారు. మరో రెండు గేమ్‌లు.. అల్టిమేట్ కార్ రేసింగ్, మానెస్టర్ ట్రక్ 3డీ.. బెస్ట్ మొబైల్ అండ్ టాబ్లెట్ గేమ్ కేటగిరీలో ఫైనలిస్ట్‌గా నిలిచాయని అన్నారు.