Annamayyapuram: అన్నమయ్యపురంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం

ఆగష్టు 15 సందర్భంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని కార్యవర్గం మరియు శిష్యులు కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సగౌరవంగా జరుపుకున్నారు.
తొలుతగా ఆలయ పూజారిచే త్రివర్ణ పతాకాన్ని అర్చించి, హారతి ఇచ్చిన అనంతరం సంస్థ మేనేజింగ్ ట్రస్టి డా. నంద కుమార్ గారు త్రీవర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
జాతీయ గీతం ఆలపించి, దేశ భక్తి గీతాలు పాడి దేశ భక్తిని చాటుకున్నారు.
ప్రసాదం వితరణ తో కార్యక్రమం ముగిసింది.