ఐదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు : ప్లాన్‌ఫుల్

వ్యాపార సంస్థల నిర్వహణకు అవసరమైన క్లౌడ్ సాంకేతికతను అందించే అమెరికా సంస్థ ప్లాన్‌ఫుల్ హైదరాబాద్‌లో పరిశోధన- అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ప్రారంభించింది. 2011-12లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాక దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టామని, అయిదేళ్లలో మరో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సీఈఓ గ్రాంట్ హాల్‌రన్ వివరించారు. ప్రస్తుతం 200 మంది నిపుణులుండగా, ఏడాదిలో కొత్తగా 100 మందిని, ఆ తర్వాత మరో 100 మందిని నియమించుకుంటామని తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్న 1,500 మందికి పైగా వినియోగదారులకు హైదరాబాద్ కేంద్రం సేవలను అందిస్తోందని వివరించారు.
Tags