వాయల్పాడులో 200 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన శశాంక్ రెడ్డి
కరోనా సంక్షోభ వేళలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాయల్పాడులోని నిరుపేద కుటుంబాలకు వర్జీనియాలో ఉంటున్న వైఎస్ఆర్సిపి ఎన్నారై రీజినల్ ఇన్ఛార్జి శశాంక్ రెడ్డి సహాయపడుతున్నారు. తన తల్లి సంపూర్ణమ్మపేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా సొంతూరిలో ఉంటున్న ఎంతోమంది పేద కుటుంబాలకు ఆయన సహాయాన్ని అందిస్తున్నారు. మే 7వ తేదీన వాయల్పాడులోని గంగమ్మ గుడి వద్ద సంపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ఆరమడక ఫ్యామిలీ తరపున దాదాపు 200 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. శశాంక్ రెడ్డి తండ్రి ఆరమడక రమేష్ రెడ్డి, పెదనాన్న ఆరమడక నగేశ్ రెడ్డి, ఆరమడక కృష్ణారెడ్డి తదితరులు పేదలకు వస్తువులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శశాంక్ రెడ్డి మిత్రులు వాసుల పర్వతాల, హరిప్రసాద్ చెక్కల, సుమలత కానోజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






