Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. పులివెందుల ఉపఎన్నికపై జగన్ ఫైర్
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Jagan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గుండా మాదిరిగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సీట్లను హైజాక్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి “బ్లాక్ డే”గా అభివర్ణించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన (Jagan) డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా బూత్‌లు మార్చడం, వైసీపీ ఏజెంట్లను భయపెట్టడం, ఓటర్లను అడ్డుకోవడం వంటి అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. మహిళా ఏజెంట్లపై కూడా దాడులు జరిగాయన్నారు. పోలీసులు, ముఖ్యంగా డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, ఎన్నికల అక్రమాలకు దగ్గరుండి కాపలా కాశారని జగన్ (Jagan) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవి అసలు ఎన్నికలేనా? అని ఆయన ప్రశ్నించారు.







